'పతంజలి'కి మహారాష్ట్ర సీఎం సతీమణి ప్రచారం...మహిళల నిరసనలు..!
- సోలాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి
- పతంజలి ఉత్పత్తులను ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని ప్రశంస
- ఉత్పత్తుల విక్రయం ద్వారా వస్తున్న రాబడి దేశానికి ఉపయోగపడుతోందని వెల్లడి
కార్యక్రమానికి అంతరాయమేర్పడకుండా వారిని అరెస్టు చేసి తర్వాత ఎలాంటి కేసులు నమోదు చేయకుండా విడుదల చేశామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ....పతంజలి ఉత్పత్తులను ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారని, వాటి అమ్మకాల ద్వారా వస్తున్న రాబడి దేశానికి ఉపయోగపడుతోందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి, ఎంపీ హేమమాలిని కూడా హాజరయ్యారు.