'ఎమ్మెల్యే' ట్రైలర్: 'నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టలేదు' అంటోన్న కల్యాణ్ రామ్
- అలరిస్తోన్న డైలాగులు
- పిల్లలకు చదువునిస్తే ఎలాగైనా బతుకుతారు అనే కాన్సెప్ట్‌తో సినిమా
- ఈ నెల 23న 'ఎమ్మెల్యే' విడుదల
'మా ఊరిలో నన్ను అందరూ మంచి లక్షణాలున్న అబ్బాయి అని పిలుస్తారు.. దాన్నే షార్ట్ ఫామ్‌లో ఎమ్మెల్యే' అంటారు అని కల్యాణ్ రామ్ చెబుతోన్న డైలాగులు అదుర్స్ అనిపిస్తున్నాయి. 'పిల్లలకు ఆస్తులిస్తే అవి ఉంటేనే బతుకుతారు.. అదే చదువునిస్తే ఎలాగైనా బతుకుతారు' అంటూ కాజల్ ఓ డైలాగ్ కొట్టింది. ఈ సినిమా కథ కాజల్ వదిలిన ఈ డైలాగ్‌ను బట్టి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 'నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టేలేదు.. మొదలు పెడితే మీరు చేయడానికి ఏమీ ఉండద'ని కల్యాణ్ రామ్ మరో డైలాగు చెప్పాడు. మీరూ చూడండి..