12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష!: చట్టాన్ని ఆమోదించిన హర్యానా అసెంబ్లీ
- బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం
- బాలికలను కాపాడుకునేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందన్న సీఎం
- రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోనూ ఈ తరహా చట్టం
బాలికలపై అత్యాచారం చేసినవారికి మరణ దండనే సరైనదంటూ, ఇందుకు సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లోగడే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఐపీసీలోని పలు సెక్షన్లను సవరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో బాలికలపై అత్యాచార ఘటనలు వరుసగా ఐదు వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అడుగులు వేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇదే తరహా చట్టాన్ని గతేడాది ఆమోదించిన విషయం విదితమే.