ప్రజాకోర్టులో అడ్డంగా బుక్కయిన చంద్రబాబు: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

  • చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి
  • వైకాపా అవిశ్వాసానికి మద్దతిస్తామని ముందు వ్యాఖ్య
  • ఆపై యూ టర్న్ తీసుకుని రాష్ట్ర ద్రోహిగా మారారు
  • వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన రెండు నాలుకల ధోరణితో ప్రజాకోర్టులో మరోసారి అడ్డంగా బుక్కయ్యారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. 'తొలుత మేము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని చెప్పిన ఆయన, ఆపై మాట తప్పి తన నైజమే అంతని నిరూపించుకున్నార'ని విమర్శించారు.

ఈ ఉదయం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు గతంలో ఎన్నోమార్లు యూ టర్న్ తీసుకున్నారని, ఇప్పుడు తీసుకున్న యూ టర్న్ ఆయన్ను రాష్ట్ర ద్రోహిగా మారుస్తుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఎంతమాత్రమూ లేదని ఆరోపించిన విజయసాయి, తమ అవిశ్వాస తీర్మానానికి బీజేపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలూ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
Go Back to Shorts
YSRCP
Vijayasai Reddy
Chandrababu

More Telugu News