piyush goyal: పరిశీలనలో విశాఖపట్నం రైల్వే జోన్ అంశం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నం రైల్వే జోన్ అంశం పరిశీలనలో ఉందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ‌కు రైల్వే జోన్ పై సంబంధిత శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతామ‌ని, అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. రైల్వే జోన్ అంశంపై తాను పలు సందర్భాల్లో సమాధానం ఇచ్చాన‌ని అన్నారు.

విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎక్కడా లేదని, పరిశీలించాలని మాత్రమే ఉందని పీయూష్ గోయల్ అన్నారు. కాగా, టీడీపీ ఎంపీలు తనను కలవడానికి ఒప్పుకోలేదని మీడియాలో కథనాలు వచ్చాయని, అవి అవాస్త‌వాల‌ని చెప్పారు. ప్రతి మంగళవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఎంపీలు తనను కలిసే వెసులుబాటు ఉంటుందని అన్నారు. టీడీపీ ఎంపీలు త‌న‌ అపాయింట్ మెంట్ కోరినట్లు త‌న‌కు సమాచారం అంద‌లేద‌ని అన్నారు. టీడీపీ ఎంపీలు తన ఆఫీసుకి వచ్చినట్లు కూడా తన దృష్టికి రాలేదని అన్నారు.
Go Back to Shorts
piyush goyal
Vizag
railway zone

More Telugu News