nayanatara: పేదింటి యువతిగా నయనతార!

షార్ట్స్‌లో చూడండి
కొంతకాలం క్రితం వరకూ గ్లామర్ పాత్రలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసిన నయనతార, ఈ మధ్య కాలంలో నటనకి ప్రాధాన్యతకలిగిన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తున్నారు. అలా ఆమె చేసిన సినిమాలు కూడా ఆమెకి వరుస విజయాలను అందిస్తూ .. తిరుగులేని నాయికగా నిలబెడుతున్నాయి.

 తమిళంలో 'ఆరం' చిత్రంతో మరోమారు మంచి మార్కులు కొట్టేసిన నయనతార, ప్రస్తుతం అక్కడ 'కో కో' అనే సినిమా చేస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో .. నెల్సన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతిగా నయనతార కనిపించనుందని చెబుతున్నారు. పేదింటి అమ్మాయిగా ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుందట. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
Go Back to Shorts
nayanatara

More Telugu News