తన గాయాలపై పెదవి విప్పిన దీపికా పదుకొనె... ఫిజియోథెరపీ తీసుకోనున్నట్టు వెల్లడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన గాయాలపై పెదవి విప్పిన దీపికా పదుకొనె... ఫిజియోథెరపీ తీసుకోనున్నట్టు వెల్లడి

  • పద్మావత్ సినిమా సమయంలో మెడ, వెన్ను నొప్పి
  • బాగానే కోలుకున్నానన్నదీపిక
  • త్వరలోనే ఫిజియోథెరపీ తీసుకోనున్నట్టు వెల్లడి
పద్మావత్ సినిమా భారీ విజయోత్సాహంతో ఇన్నాళ్లూ తన గాయాలపై మౌనంగా ఉన్న దీపికా పదుకొనె ఎట్టకేలకు పెదవి విప్పింది. ఇంతకీ విషయం ఏమిటంటే సినిమా చిత్రీకరణలో భాగంగా దీపిక అధికంగా శ్రమించడం వల్ల గతంలోని గాయం తాలూకూ నొప్పి తిరగబెట్టింది. దీంతో ఆమె వెన్నుపూస, మెడ భాగంలో భరించలేనంత నొప్పి వేధించడం మొదలైంది. అందుకే ఇటీవలి పలు వేదికల్లో ఆమె మెడకు బ్యాండేజీలతో దర్శనమిచ్చింది. కానీ, ఎక్కడా దాని గురించి మాత్రం ప్రస్తావించింది లేదు. చివరికి తాజాగా జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో గాయం నుంచి బాగానే కోలుకుంటున్నానని, త్వరలోనే ఫిజియో థెరపీ తీసుకోనున్నట్టు ఆమె వెల్లడించారు. దీనిపై ఆందోళన చెందక్కర్లేదని అభిమానులకు సూచించారు. 
Deepika Padukone
injury

More Telugu News