మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న హాట్ హీరోయిన్
- రేస్-3 చిత్రం కోసం యుద్ధ కళల్లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ శిక్షణ
- ఆహార నియమాల్లోనూ మార్పులు..ట్రైనర్‌గా కుల్‌దీప్
- కిక్కింగ్, పంచింగ్‌లపై ప్రత్యేక దృష్టి
రేస్-3 సినిమాలోని జాక్వెలైన్ నటించే పోరాట సన్నివేశాలకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పటివరకు ఆమె చేతులతో ముష్టిఘాతాలు చేయడం లేదా మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించడం ఏ సినిమాలోనూ చేయలేదు. అందువల్ల ఈ యుద్ధ కళల్లో ఆమెకు తర్ఫీదునివ్వడంపై ప్రస్తుతం తాను దృష్టి పెట్టామని కుల్‌దీప్ చెప్పారు. ఆమె తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు. శిక్షణ సమయంలో ఆమె తన శరీరంలోని కేలరీలను అధిక మొత్తంలో కరిగిస్తోంది. అందువల్ల డైట్‌లో మార్పు చేశామని ఆయన తెలిపారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.