హీరోయిన్ ఆదా సింగర్ అవతారమెత్తిన వేళ....

  • ప్రభుదేవా చార్లీ చాప్లిన్-2 చిత్రంలో ఆదా పాట
  • ఈ చిత్రం ద్వారానే తమిళ తెరకు పరిచయమవుతున్న ముద్దుగుమ్మ
  • తన మాతృభాష తమిళమేనని వెల్లడి
తెలుగులో హీరో నితిన్‌తో 'హార్ట్ ఎటాక్' చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ ఆదా శర్మ నటనతో పాటు తనలో గాయని కూడా ఉందని నిరూపించుకుంది. ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా తమిళంలో హీరోగా నటిస్తున్న 'చార్లీ చాప్లిన్-2' చిత్రం ద్వారా ఆమె నటిగానే కాక సింగర్‌గా కూడా తెరంగేట్రం చేస్తోంది. హిందీలో చివరగా కమాండో-2 చిత్రంలోనూ తెలుగులో క్షణం చిత్రంలోనూ ఆదా కనిపించింది. ఆమె పదేళ్ల పాటు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. "చార్లీ చాప్లిన్-2 చిత్రం ద్వారా తమిళ సినీ రంగానికి పరిచయమవుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను తమిళ సినిమా చేయాలని మా నాన్న ఎప్పుడూ కోరుకునేవారు. దర్శకుడు శక్తి చిదంబరం, నిర్మాత టి.శివ, సంగీత దర్శకుడు అమ్రిశ్ ఈ పాటకు నేనే పర్ఫెక్ట్ అని భావించారు. తమిళం నా మాతృభాష. అందుకే ఇది బాగా కుదిరింది" అని ఆదా చెప్పుకొచ్చింది. ఆమె ఆలపించిన ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను రాసింది ఈ సినిమా దర్శకుడే కావడం గమనార్హం.
Go Back to Shorts
Adah Sharma
Kshanam
Charlie Chaplin 2
Prabhudheva

More Telugu News