ప్రేమ విలువ ! పెళ్లి అయిన ఆరో రోజే భార్యను ప్రేమికుడికి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించిన భర్త!
- భార్య ప్రేమ విషయం తెలిసి పెద్ద మనసుతో ఆలోచించిన భర్త
- మూడు నిండు జీవితాలు నాశనం కాకుండా గొప్ప నిర్ణయం
- భార్య, ప్రేమికుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించిన వైనం
- అందరి సమక్షంలో ఘనంగా వివాహం
టప్పూ భార్యతో ఆ యువకుడు సన్నిహితంగా ఉండడాన్ని చూసిన స్థానికులు అతడిని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి చితకబాదారు. దీంతో బయటకువచ్చిన కొత్త పెళ్లి కూతురు అతడు తన ప్రేమికుడని చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. తమ వివాహానికి పెద్దలు అడ్డుచెప్పడంతో మరోమార్గం లేక ఈ వివాహానికి అంగీకరించినట్టు చెప్పడంతో అందరూ షాకయ్యారు.
విషయం తెలిసిన కొత్త పెళ్లికొడుకు టప్పూ కూడా కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చి ప్రేమికుడితో తన భార్యకు మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించాడు. భార్య తల్లిదండ్రులు, సోదరులతో మాట్లాడి ఒప్పించాడు. భార్య తరపు బంధువులు, ఆమె ప్రేమికుడి కుటుంబ సభ్యులు శనివారం పంపారాకు చేరుకున్నారు. వారందరి సమక్షంలో టప్పూ తన భార్య పెళ్లిని ప్రేమికుడితో ఘనంగా జరిపించాడు. ఈ వివాహానికి హాజరైన వందలాది మంది వారిద్దరినీ దీవించారు. అంతేకాదు.. టప్పూ పెద్ద మనసును కొనియాడారు.
వివాహం అనంతరం టప్పూ మాట్లాడుతూ.. తాను కనుక తన భార్యకు ప్రేమికుడితో వివాహం జరిపించకపోయి ఉంటే మూడు జీవితాలు నాశనం అయిపోయి ఉండేవని పేర్కొన్నాడు. ఈ ఒక్క పనితో ఇప్పుడు ముగ్గురం సంతోషంగా ఉన్నామన్నాడు. టప్పూ తల్లి కూడా కుమారుడి నిర్ణయాన్ని స్వాగతించి మద్దతు తెలిపింది. టప్పూ తమకు చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని మాజీ భార్య పేర్కొంది.