దేశంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న చట్టసభ్యులెందరో తెలుసా?
- దేశవ్యాప్తంగా 1700 మందికి పైగా చట్టసభ్యులపై క్రిమినల్ కేసులు
- టాప్‌లో యూపీ..తర్వాతి స్థానాల్లో తమిళనాడు, బీహార్, ప.బెంగాల్
- పెండింగ్‌లోనే 3045 క్రిమినల్ కేసులు
ఈ 3816 కేసుల్లో, ఒక్క ఏడాదిలోపల 125 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఇలాంటి కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలి. అయితే పెండింగ్ కేసులకు సంబంధించిన తాజా గణాంకాలు కోర్టు తీర్పును బేఖాతరు చేసినట్లు అర్థమవుతోంది. గత మూడేళ్ల కాలంలో 771 కేసుల విచారణ పూర్తయింది. మరో 3045 కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతేడాది డిసెంబరులో జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశం మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని అందజేసింది.