Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-కారు ఢీ.. నలుగురు దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మాదిగవాణి తోపు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను సదాశివ (52), గిరిజ (47), పలికల్ గట్టి (72), జప్పగట్టిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Go Back to Shorts
Road Accident
Chittoor
Bus
Car
Andhra Pradesh

More Telugu News