'ఎమ్మెల్యే' పాటల పండుగకి ముహూర్తం కుదిరింది!
- 'ఎమ్మెల్యే'గా కల్యాణ్ రామ్
- ఆయన జోడీగా కాజల్
- ఈ నెల 17న ఆడియో రిలీజ్
మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆయన అందించిన పాటలను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ పాటల పండుగకు 'కర్నూల్' వేదిక కానుంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు.