బీసీసీఐ సాయం తీసుకోవాలని క్రికెటర్ షమి భార్య హసిన్ జహాన్ నిర్ణయం
- మా న్యాయవాది బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు-హసిన్
- ఇటువంటి వ్యవహారాలు ఇక్కడితో ఆగిపోవాలి
- లేదంటే భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేస్తారు
కాగా, ఈ విషయంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సాయం తీసుకోవాలని షమి భార్య హసిన్ జహాన్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తన న్యాయవాది ఈ విషయమై బీసీసీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పింది. ఇటువంటి వ్యవహారాలు ఇక్కడితో ఆగిపోవాలని, లేదంటే భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.