'శ్రీనివాస కల్యాణం' కోసం భారీ ఇంటి సెట్
- దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
- దర్శకుడిగా సతీశ్ వేగేశ్న
- నితిన్ సరసన రాశి ఖన్నా
నితిన్ .. రాశి ఖన్నా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. రెండు కుటుంబాలు .. ఒక వివాహ బంధం చుట్టూనే ఈ కథ తిరుగుతుందట. ఆ కుటుంబాలకి సంబంధించిన భారీ ఇంటి సెట్స్ ను రాజమండ్రి సమీపంలో వేయించారు. ఈ ఇళ్లు 'కూనవరం'లో వున్నట్టుగా కథ కొనసాగుతుంది. ప్రధాన పాత్రధారులంతా పాల్గొనగా, దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ పెళ్లికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.