nikhil: నిఖిల్ న్యూ మూవీ టైటిల్ ఇదేనట!

  • నిఖిల్ హీరోగా 'కనితన్' రీమేక్ 
  • దర్శకుడిగా సంతోష్ 
  • రిజిష్టర్ చేయించిన టైటిల్ గా 'ముద్ర'

నిఖిల్ తాజా చిత్రంగా 'కిరాక్ పార్టీ' ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆయన తదుపరి సినిమా 'కనితన్' రీమేక్ షూటింగ్ మొదలైపోయింది. తమిళంలో హిట్ కొట్టిన ఈ సినిమాకి సంతోష్ దర్శకుడిగా వ్యవహరించాడు. తెలుగు రీమేక్ కి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు, తాజాగా 'ముద్ర' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారు. దాంతో ఈ సినిమాకి ఈ టైటిల్ ఖరారైనట్టేనని అంటున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో 'అర్జున్' అనే పాత్రలో నిఖిల్ కనిపిస్తాడట. ఆయన పాత్ర వెరైటీగా మలచబడిందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కేథరిన్ .. రష్మిక మందన .. మేఘ ఆకాశ్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.        

More Telugu News