శ్రీదేవి ఉండుంటే... ఆమె తదుపరి ప్రాజెక్టు ఇదే...!
- శ్రీదేవితో సినిమాకు నిర్మాత కరణ్ జోహార్ ప్రయత్నం
- ఆమె సైతం నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం
- బతికుండుంటే ఈ ఏప్రిల్‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం
ఆ తర్వాత మరో వారం రోజులకు ఆమె ఇంటికి మళ్లీ వెళ్లి "ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ సినిమాకి సంబంధించి కథ సిద్ధమవుతోంది. అందులో మీరు నటిస్తారా?" అంటూ ఆమెను ఆయన అడిగారట. కథ నచ్చడంతో ఆమె కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆమె చనిపోకుండా ఉండుంటే ఆ చిత్రం ఈ ఏప్రిల్‌లోనే సెట్స్‌పైకి వెళ్లేదని కరణ్ సన్నిహితులు చెబుతున్నారు. శ్రీదేవికి వీరాభిమాని కావడంతో 'బెస్ట్ ఆఫ్ శ్రీదేవి' పేరుతో ఓ వీడియో క్యాసెట్‌ను రూపొందించానని, ప్రతిరోజూ వాటిని వీలు దొరికినప్పుడల్లా చూస్తుంటానని కరణ్ చెబుతున్నారు.