రాఘవేంద్రరావు తనయుడి కొత్త సినిమా 'మెంటల్ హై క్యా'!
- కమర్షియల్ చిత్రాల దర్శకేంద్రుడు.. విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రకాశ్
- 'మార్నింగ్ రాగా', 'అనగనగా ఒక ధీరుడు', 'సైజ్ జీరో' సినిమాలతో గుర్తింపు
- రాజ్ కుమార్ రావ్, కంగనా రనౌత్ లతో 'మెంటల్ హై క్యా' సినిమా
బాలీవుడ్ యువ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో 'మెంటల్ హై క్యా' అనే సినిమాను రూపొందిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాను సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. కాగా, ఈ సినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేయగా, సోషల్ మీడియాను అది ఆకట్టుకుంటోంది.