maoists: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోల బీభత్సం!

  • ఇటీవలి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం
  • టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్, మూడు లారీలకు నిప్పు
  • ప్రయాణికులను సీఆర్పీఎఫ్ క్యాంపునకు తరలించిన భద్రతా సిబ్బంది
ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు సోమవారం రాత్రి బీభత్సం సృష్టించారు. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా డోర్నపాల్ మండలం కుత్తిలో తెలంగాణ ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు. బస్సు హైదరాబాద్ నుంచి జగదల్‌పూర్ వెళ్తుండగా అడ్డుకున్న మావోలు ప్రయాణికులను దించేసి బస్సును తగలబెట్టారు. అలాగే మరో ప్రైవేటు బస్సు, ట్రాక్టర్‌, మూడు లారీలకు కూడా నిప్పు పెట్టారు.  ఈ రెండు ఘటనల్లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుకు తరలించారు.
maoists
Telangana
Chhattisgarh
Encounter

More Telugu News