హార్దిక్ పాండ్యా ప్రేమ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసింది.. నటి ఎల్లీతో దొరికిపోయిన ఆల్‌రౌండర్!

షార్ట్స్‌లో చూడండి
టీమిండియా ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేమ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌తో డేటింగ్‌లో ఉన్న వార్తలకు బలం చేకూరింది. శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి కారులో వచ్చిన హార్దిక్ పక్కన ఎల్లీ కనిపించడంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది. తనను మీడియా గమనిస్తోందన్న విషయాన్ని గ్రహించిన ఎల్లీ తన ముఖాన్ని జుట్టుతో కప్పేసుకున్నప్పటికీ కెమెరాలు తమ పనికానిచ్చేశాయి. హార్దిక్ మాత్రం మౌనంగా ఎయిర్‌పోర్టులోకి వెళ్లిపోయాడు.

ఇటీవల జరిగిన హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ అవ్రమ్ హాజరయ్యారు. హార్దిక్, ఎల్లీలు పక్కపక్కనే నిల్చుని ఫొటోలకు పోజిచ్చారు. వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు హల్‌చల్ చేశాయి. స్పందించిన ఎల్లీ ఎవరేం అనుకుంటే తనకేంటని ఘాటుగా బదులిచ్చారు. అంతేతప్ప తమ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి బయటపెట్టలేదు. తాజాగా ఇద్దరూ కలిసి విమానాశ్రయంలో కనిపించడంతో హార్దిక్-ఎల్లీ ప్రేమ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది.
Go Back to Shorts
Hardik pandya
Elli Avram
Bollywood

More Telugu News