కొత్త దర్శకుడితో కల్యాణ్ రామ్ 'మిలియనీర్ '
- వరుస సినిమాలతో కల్యాణ్ రామ్
- కొత్త దర్శకుడితో నెక్స్ట్ మూవీ
- త్వరలోనే సెట్స్ పైకి
'నిన్నుకోరి' కథతో నాని దగ్గరికి దర్శకుడు శివ నిర్వాణను పంపించి .. ఆ ప్రాజెక్టు ఓకే కావడంలో కోన వెంకట్ ప్రధానమైన పాత్రను పోషించాడు. అలాగే తాజాగా మరో కొత్తదర్శకుడిని కల్యాణ్ రామ్ దగ్గరికి పంపించి ఆ కథకు గ్రీన్ సిగ్నల్ వచ్చేట్టుగా చేశారని అంటున్నారు. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందనుందని వినికిడి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించనున్నారు. ఈ సినిమా తరువాతనే పవన్ సాదినేనితో కలిసి కల్యాణ్ రామ్ సెట్స్ పైకి వెళతాడని చెబుతున్నారు.