mumbai: ఆటలో గెలిచాడని కత్తితో పొడిచి హతమార్చాడు

షార్ట్స్‌లో చూడండి
ఆటలో ఓడించాడన్న కారణంతో ఓ యువకుడు మరో యువకుడిని హత్య చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... దక్షిణ ముంబైలోని అగ్రిపదా ప్రాంతానికి చెందిన అబుజార్‌ అన్సారీ (24) ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చి, పొరుగింట్లోని మహ్మద్‌ మన్సూరీని యూనో కార్డ్స్‌ (పేకాట) గేమ్‌ ఆడుదామని పిలిచాడు. ఇద్దరూ కలిసి అన్సారీ ఇంటి ముందు కూర్చుని కాసేపు ఆడారు. కాసేపటికి అన్సారీ గెలిచాడు.

 దీంతో మోసం చేసి గెలిచావంటూ అన్సారీపై మన్సూరీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానిని పట్టించుకోని అన్సారీ, తానే గెలిచానంటూ నవ్వసాగాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మన్సూరీ తనదగ్గరున్న కత్తితో అన్సారీ ఛాతి, భుజంపై పలుమార్లు బలంగా పొడిచి పారిపోయాడు. దీంతో వారిని చూస్తున్న ఇరుగుపొరుగువారు తీవ్రగాయాలపాలైన అన్సారీని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, మన్సూరీని అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
mumbai
agripada murder
murder

More Telugu News