Rajinikanth: 'కాలా'ని ఆపేదెవరురా.....? టీజర్‌కు అనూహ్య స్పందన

షార్ట్స్‌లో చూడండి
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా' చిత్రం టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. వీక్షకుల సంఖ్య రెండు కోట్లను క్రాస్ చేసి, ఇంకా అదే జోరును కొనసాగిస్తోంది. తద్వారా సూపర్‌స్టార్ మరోసారి తన స్టామినా చాటుకుంటున్నారు. గతంలో 'కబాలీ' చిత్రం టీజర్‌కి కూడా ఇదే విధమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

'కబాలీ'కి దర్శకత్వం వహించిన యువ సంచలనం పా రంజిత్ 'కాలా'కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. స్టైల్ అంటేనే రజనీ. అలాంటి రజనీని కబాలీతో పాటు కాలాలోనూ అద్భుతంగా చూపించాడు రంజిత్. మాఫియా నేపథ్యంతో సాగే సినిమా ఇది. ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి రజనీ అల్లుడు ధనుష్ నిర్మాత. సంతోష్ నారాయణ్ బాణీలు సమకూర్చాడు.
Go Back to Shorts
Rajinikanth
Teaser
Kabaali
Kaala

More Telugu News