వర్మలో సత్తా ఉందా? లేదా? అన్నట్టు చూస్తున్న నాగార్జున... ఓల్డ్ మెమొరీ దృశ్యం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వర్మలో సత్తా ఉందా? లేదా? అన్నట్టు చూస్తున్న నాగార్జున... ఓల్డ్ మెమొరీ దృశ్యం!

  • 28 ఏళ్ల క్రితం 'శివ' స్టోరీని నాగ్ కు చెప్పిన వర్మ
  • ఆపై తీసిన ఫొటోను షేర్ చేసుకున్న వర్మ
  • అభిమానుల వెరైటీ కామెంట్లు
దాదాపు పాతికేళ్ల తరువాత నాగార్జునతో మరో చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ, ఓ పాత మధురాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 28 సంవత్సరాల క్రితం, తాను 'శివ' చిత్ర కథను చెప్పిన వెంటనే నాగార్జున హావభావాలను చూపుతూ తీసిన చిత్రాన్ని అభిమానులతో తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నాడు.

"29 ఏళ్ల క్రితం నేనేమైనా బ్రేక్ ఇవ్వగలనా? లేదా? అన్నట్టు తదేకంగా చూస్తున్న నాగార్జున. 'శివ' స్క్రిప్టును చెప్పిన వెంటనే తీసిన చిత్రమిది" అన్న క్యాప్షన్ ను ఆ చిత్రానికి చేర్చాడు కూడా. ఇక ఈ పిక్ పై వింత వింత కామెంట్లు అభిమానుల నుంచి వస్తున్నాయి. తాను ఇండియాకు ఓ పోర్న్ డైరెక్టర్ ను అందిస్తున్నానని అప్పట్లో నాగ్ కు తెలియదని ఒకరు, హమ్మయ్య, మా వర్మ శ్రీదేవి మృతి విషాదం నుంచి ఇప్పటికి కోలుకున్నాడని ఇంకొకరు... ఇలా సాగుతున్నాయి కామెంట్లు
Nagarjuna
Ramgopal Varma
Shiva

More Telugu News