swimming: సెంచురీ కొట్టే వయసులో.. ఈతలో రికార్డు కొట్టిన తాతగారు!

షార్ట్స్‌లో చూడండి
రికార్డులు నెలకొల్పడానికి వయసుతో పనిలేదు అంటున్నాడు ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ కారోన్స్. ఎందుకంటే, మరో నెల రోజుల్లో 99 నిండి, వందేళ్ల వయసులోకి ప్రవేశించనున్న ఈయనగారు ఈత కొట్టడంలో ప్రపంచ రికార్డు కొట్టేశాడు మరి! పట్టుదల, ఉత్సాహం, లక్ష్యం వుండాలే గానీ, ఏ వయసులోనైనా ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.

50 మీటర్ల  ఫ్రీ స్టైల్ ఈ వెంట్ ను జార్జ్ కారోన్స్ కేవలం 56.12 సెకండ్లలో ఈది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డు అంతకు ముందు బ్రిటిష్ స్విమ్మర్ జాన్ హారిసన్ పేరిట ఉండేది. ఆయన 2014లో ఆ ఈవెంట్ ను 1.31.19 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడు. దానిని తాజాగా కారోన్స్ సవరించాడు. అందుకే ఈ తాతగారికి అంతా ఇప్పుడు గ్రీటింగ్స్ చెప్పేస్తున్నారు!  
Go Back to Shorts
swimming
gorge karons
world record

More Telugu News