సెల్ఫీ పిచ్చి పెరిగిపోయింది .. ఇవ్వకపోతే విలన్స్ ను చేస్తున్నారు: యాంకర్ రవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెల్ఫీ పిచ్చి పెరిగిపోయింది .. ఇవ్వకపోతే విలన్స్ ను చేస్తున్నారు: యాంకర్ రవి

  • నేను హాస్పిటల్ కి వెళుతున్నాను 
  • ఆ టెన్షన్ లో ఉండగా సెల్ఫీ అడిగారు 
  • ఇవ్వకపోతే వీడియో తీశారు
వివిధ ఛానల్స్ లోని గేమ్ షోస్ లోను .. స్టేజ్ షోస్ లోను రవి బాగా సందడి చేస్తుంటాడు. తన జోష్ తో ప్రేక్షకులను హుషారెత్తిస్తుంటాడు. అలాంటి రవి తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. యాంకర్స్ కి ఎదురవుతోన్న ఇబ్బందులను గురించి ప్రస్తావించాడు. " రీసెంట్ గా నేను అత్యవసరమైన పనిమీద హాస్పిటల్ కి వెళుతున్నాను. మా కజిన్ వాళ్ల నాలుగు నెలల బాబుకి సీరియస్ గా ఉండటంతో టెన్షన్ తో వున్నాను. ఒక చోట కారు ఆపేసి .. ఫోన్లో డాక్టర్ తో మాట్లాడుతున్నాను"

"అంతలో ఓ ముగ్గురు కుర్రాళ్లు అటుగా వెళుతూ నన్ను చూసి కారు దగ్గరికి వచ్చారు. ఒక వైపున నేను ఫోన్ మాట్లాడుతుంటే .. మరో వైపున వాళ్లు కారు డోర్ పై కొడుతూ సెల్ఫీ అడుగుతున్నారు. ఇప్పుడు కుదరదంటూ  సైగలతో నేను వాళ్లను బతిమాలుకోవలసి వచ్చింది. దాంతో వాళ్లు కారు ముందుకు వెళ్లి నన్ను వీడియో తీయడం మొదలుపెట్టారు. ఇలా ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలంటూ ఇబ్బంది పెట్టేస్తున్నారు .. ఇవ్వకపోతే విలన్స్ ను చేసేస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు.     
ravi

More Telugu News