nani: నాని మూవీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్?

షార్ట్స్‌లో చూడండి
నాని తాజా చిత్రంగా 'కృష్ణార్జున యుద్ధం' చిత్రం రూపొందుతోంది. నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో, అనుపమ పరమేశ్వరన్ .. రుక్సార్ మీర్ కథానాయికలుగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదలకు ప్లాన్ చేశారు. మరోపక్క, ఏప్రిల్ 20వ తేదీన కొరటాల - మహేశ్ బాబు కాంబినేషన్లోని 'భరత్ అనే నేను' విడుదల కానుంది. అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే 'కృష్ణార్జున యుద్ధం' సినిమాకి .. 'భరత్ అనే నేను'కి మధ్య వారం రోజుల గ్యాప్ మాత్రమే వుంది. నాని సినిమా హిట్ అయితే 'భరత్ అనే నేను'కి ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకడం కష్టమే అవుతుంది. అందువలన నాని సినిమా విడుదల తేదీని మార్చుకోమని ఆ సినిమా నిర్మాతలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. నిర్మాతలు అంగీకరిస్తే .. నాని సినిమా రిలీజ్ డేట్ మరో వారం ముందుకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.  
Go Back to Shorts
nani
anupama

More Telugu News