sridevi: చెన్నైలో ప్రాపర్టీల గురించి శ్రీదేవి ఈమధ్యే నాతో మాట్లాడింది!: టి.సుబ్బరామిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
శ్రీదేవి చనిపోయిందన్న వార్తతో దిగ్భ్రాంతికి లోనయ్యానని కాంగ్రెస్ ఎంపీ, సినీ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆమె లేదనే వార్తను నమ్మలేకపోతున్నానని చెప్పారు. చాలా బాధగా ఉందని, బాధను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి చాలా గొప్ప ఆర్టిస్ట్ అని అన్నారు. చెన్నైలో శ్రీదేవికి చాలా ప్రాపర్టీలు ఉన్నాయని, వాటిని పిల్లలకు అందించే విషయమై ఇటీవలే తనతో మాట్లాడిందని గుర్తు చేసుకున్నారు.

40 ఏళ్ల కాలంలో శ్రీదేవిని ఎప్పుడూ నవ్వు ముఖంతోనే చూశానని, ఎప్పుడూ ఒకే మూడ్ లో ఉండటం ఆమె గొప్పదనమని చెప్పారు. 'భక్తతుకారాం' సినిమా సమయంలో శ్రీదేవి చాలా చిన్న అమ్మాయి అని... అప్పుడు ఆమెను తొలిసారి చూశానని తెలిపారు. అప్పుడు శ్రీదేవిని తీసుకుని వాళ్ల అమ్మ మా ఇంటికి వచ్చిందని... ఆ రోజు మా ఇంట్లోనే భోజనం చేశారని తెలిపారు. ఆమధ్య 'మా కుమార్తెను హీరోయిన్ చేయాలనుకుంటున్నాను... బ్లెస్ చేయండి సార్' అని తనను శ్రీదేవి అడిగిందని... తన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని చెప్పానని అన్నారు.  
Go Back to Shorts
sridevi
death
t subbarami reddy

More Telugu News