nani: వెనక్కి తగ్గే ఆలోచనలో దిల్ రాజు .. వద్దంటోన్న నాని!

షార్ట్స్‌లో చూడండి
నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ రెండు పాత్రల సరసన అనుపమ పరమేశ్వరన్ .. రుక్సార్ మీర్ కథానాయికలుగా నటిస్తున్నారు. సాహు గారపాటి .. హరీష్ పెద్ది నిర్మిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ రిలీజ్ డేట్ దగ్గరిలోకి 'భరత్ అనే నేను' (ఏప్రిల్ 20) వచ్చేసింది. 'కృష్ణార్జున యుద్ధం' సినిమాను హోల్ సేల్ గా దిల్ రాజు కొనేశారు. 'భరత్ అనే నేను' హిట్ టాక్ తెచ్చుకుంటే .. ఆ ప్రభావం ఈ సినిమాపై పడుతుందనేది దిల్ రాజు ఆందోళన. అందువలన ఈ సినిమాను మే 18వ తేదీన విడుదల చేయాలనేది ఆయన ఆలోచన .. 'ఫరవాలేదు ఏప్రిల్ 12న రిలీజ్ చేసేయవచ్చని' నాని అంటున్నాడట. మే 18వ తేదీన విజయ్ దేవరకొండ .. గోపీచంద్ 'పంతం' సినిమాలు వున్నాయనే సంగతి తెలిసిందే. చివరిగా దిల్ రాజు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.        
Go Back to Shorts
nani
anupama

More Telugu News