'ఎమ్మెల్యే' నుంచి బ్యూటిఫుల్ పోస్టర్
- కల్యాణ్ రామ్ హీరోగా 'ఎమ్మెల్యే'
- కథానాయికగా కాజల్
- అందమైన జోడీగా మంచి మార్కులు
తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. డైనింగ్ టేబుల్ దగ్గర కల్యాణ్ రామ్ .. ప్రేమతో కాజల్ కి ఏదో తినిపిస్తూ ఉండటం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. కల్యాణ్ రామ్ .. కాజల్ ఇద్దరి జోడీ చాలా బాగుంది. గత సినిమాల్లో కంటే ఇద్దరూ మరింత గ్లామర్ గా కనిపిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు త్వరలో ఊపందుకోనున్నాయి. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.