తిట్టిన నోటితోనే పొగడటం చంద్రబాబుకే చెల్లింది: రోజా ఎద్దేవా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిట్టిన నోటితోనే పొగడటం చంద్రబాబుకే చెల్లింది: రోజా ఎద్దేవా

  • దళితులను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ పొగుడుతున్నారు
  • ఇది చంద్రబాబుకే చెల్లింది
  • సీఎంపై రోజా విమర్శలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. దళితులకు ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబు... వాటిని నెరవేర్చకపోగా, వాళ్లను అవమానిస్తూ మాట్లాడారని అన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో.. ఇప్పుడు దళితతేజం పేరుతో వారికి దగ్గర కావాలని చూస్తున్నారని చెప్పారు. దళితులను తిట్టిన నోటితోనే వాళ్లను పొగడటం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. దీనికి తోడు ఓ పోస్టర్ ను అప్ లోడ్ చేశారు.
Chandrababu
roja
dalit

More Telugu News