నీరవ్ మోదీని చెప్పుతో కొడతా: 'ఫైర్ స్టార్ గ్రూప్' సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్ భార్య
- ఫైర్ స్టార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ ను అరెస్ట్ చేసిన సీబీఐ
- తన భర్త నిజాయతీపరుడన్న అర్జున్ భార్య
- ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటూ కన్నీటిపర్యంతం
నీరవ్ మోదీ విదేశాల నుంచి తిరిగి భారత్ కు వస్తే... చెప్పుతో కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెషన్స్ కోర్టు వెలుపల ఆమె మాట్లాడుతూ, ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త అర్జున్ నిజాయతీపరుడని, నెలకు రూ. 30 వేలు మాత్రమే సంపాదిస్తారని... ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోరని చెప్పారు. ఆఫీసులో ఏది చెబితే అది మాత్రమే చేస్తారని... ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. అమాయకుడైన తన భర్తను అనవసరంగా అరెస్ట్ చేశారని కన్నీటిపర్యంతం అయ్యారు. తమ ఇంట్లో సీబీఐ జరిపిన సోదాల్లో కూడా ఏమీ దొరకలేదని అన్నారు.