'ఛలో' దర్శకుడితో నితిన్ .. కథపై జరుగుతోన్న కసరత్తు!
- 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల
- తదుపరి సినిమాకి ఛాన్స్ ఇచ్చిన పెద్ద బ్యానర్
- కథానాయకుడిగా నితిన్
నితిన్ కి తగినట్టుగా ఒక కథను సిద్ధం చేయమని వెంకీ కుడుములతో వాళ్లు చెప్పారనేది తాజా సమాచారం. దాంతో అందుకు సంబంధించిన కథపై వెంకీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కథ ఓకే అయితే ఈ బ్యానర్లో నితిన్ కి ఇది రెండవ సినిమా అవుతుంది. గతంలో ఈ బ్యానర్లో వచ్చిన 'అ ఆ' ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.