గుజరాత్ లో మండిపోనున్న మద్యం ధరలు... భారీగా ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఆలోచన
- లీటర్ మద్యంపై రూ.200వరకు పెరుగుదల
- తాగే అలవాటును నిరుత్సాహపరిచేందుకే!
- త్వరలోనే అధికారిక ప్రకటన
‘‘రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని 50 నుంచి 100 శాతం వరకు పెంచాలనుకుంటోంది. అయితే, ఏ రకంపై ఎంత పెంచాలన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. త్వరలోనే ఇవి ఖరారవుతాయి. త్వరలో అధికారిక ప్రకటన విడుదల అవుతుంది’’ అని అధికార వర్గాలు తెలిపాయి.