మై డియర్ ప్రియా.. రానున్న రోజుల్లో నీ కోసం జనాలు తహతహలాడిపోతారు: రిషి కపూర్
- ఈ అమ్మాయి గొప్ప స్టార్ డమ్ ను సొంతం చేసుకుంటుంది
- ఆమె పలికించిన హావభావాలు అమోఘం
- నేనున్న సమయంలో నీవు ఎందుకు రాలేదన్న రిషీ కపూర్
తాజాగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ కూడా ప్రియా వారియర్ పై ప్రశంసలు కురిపించారు. ఈ అమ్మాయి అంతులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకుంటుందని తనకు అనిపిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఎంతో అమాయకంగా కనిపించే ప్రియా... తన ముఖంలో పలికించిన హావభావాలు అమోఘం అని తెలిపారు. 'మై డియర్ ప్రియా, రానున్న రోజుల్లో నీ ఏజ్ గ్రూప్ వారు నీ కోసం తహతహలాడుతారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. నేనున్న సమయంలో నీవు ఎందుకు రాలేదు?' అంటూ సరదాగా కామెంట్ చేశారు.