Narendra Modi: లోక్‌సభ ఎన్నికల పరీక్షను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు?: మోదీకి విద్యార్థి షాకింగ్ ప్రశ్న

షార్ట్స్‌లో చూడండి
'పరీక్షా పే చర్చా' పేరుతో ఈ రోజు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ఢిల్లీలోని తల్కోతోరా స్టేడియంలో విద్యార్థుల‌కు సూచనలు ఇస్తోన్న విషయం తెలిసిందే. ప‌రీక్ష‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో విద్యార్థులు ఎలా సిద్ధం కావాలో, ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలో ఆయన చెబుతున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. కాగా, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేకపోయారు.
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల పరీక్షను మీరు ఎలా ఎదుర్కోబోతున్నారో చెప్పాలని ఓ విద్యార్థి అడిగాడు. దానికి మోదీ సూటిగా సమాధానం చెప్పలేక, తాను గనక ఆ విద్యార్థికి టీచర్‌ను అయిఉంటే కచ్చితంగా అతడిని జర్నలిజం వైపు వెళ్లాలని సలహా ఇస్తానని, ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఇలాంటి మెలిక ఉండే ప్రశ్నలు వేస్తారని వ్యాఖ్యానించారు.  
Go Back to Shorts
Narendra Modi
students
New Delhi

More Telugu News