Telangana: తెలంగాణలోని ఏటీఎంలలో నగదు కొరత ఉందంటూ జైట్లీకి లేఖ రాసిన వినోద్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలోని బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు కొరత కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు. నగదు కొరత కారణంగా ఉద్యోగులు, పింఛన్ దారులు, చిరు వ్యాపారులు తదితరులు ఇబ్బందిపడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీలోని ఏటీఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని సీఎం చంద్రబాబునాయుడు నిన్న అరుణ్ జైట్లీకి ఓ లేఖ రాశారు. ఏపీకి తక్షణం రూ.5 వేల కోట్ల కరెన్సీ పంపాలని అందులో కోరారు.
Go Back to Shorts
Telangana
mp vinod

More Telugu News