వాళ్లంతా నికృష్టులు.. నా మనసు ఏడుస్తోంది: మోహన్ బాబు

  • పైరసీకి గురైన 'గాయత్రి' మూవీ
  • నా మనసు ఏడుస్తోందన్న మోహన్ బాబు
  • పైరసీ చేసినవారు, చూసినవారు నికృష్టులు
ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించి, నిర్మించిన 'గాయత్రి' సినిమా పైరసీకి గురైంది. ఆ సినిమా నెట్టింట్లో అందరికీ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో, పైరసీకి పాల్పడ్డవారిపై మోహన్ బాబు నిప్పులు చెరిగారు. సినిమాను పైరసీ చేసినవారు, పైరసీ మూవీని చూసినవారు నికృష్టులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'గాయత్రి' విషయంలో తన మనసు ఏడుస్తోందని అన్నారు. సినిమా కోసం ఒక నిర్మాతగా ఎనిమిది నెలలు పడ్డ కష్టానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడినవారు పాపం అనుభవిస్తారని శపించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ నటించారు. అతిథి పాత్రలో మోహన్ బాబు కనిపించారు. మదన్ దర్శకత్వం వహించారు.
Go Back to Shorts
mohanbabu
gayatri movie
piracy

More Telugu News