ఐపీఎల్ 11వ సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ!
- మొత్తం 60 మ్యాచ్‌లు, 51 రోజులపాటు ఐపీఎల్ పండగ
- మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్
- ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్
మొట్టమొదటి మ్యాచ్‌లో తలపడనున్న ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ కి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది. అలాగే మే 27న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి కూడా ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ 60 మ్యాచ్‌ల్లోని 12 మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుండగా, మిగతా 48 మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్నాయి.