chiranjeevi: రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోన్న 'సైరా'

షార్ట్స్‌లో చూడండి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. చరణ్ నిర్మాతగా 'సైరా' చిత్రం రూపొందుతోంది. చిరంజీవికి ఇది 151వ సినిమా .. ఆయన కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో చేస్తోన్న భారీ చిత్రం. అలాంటి ఈ సినిమా ఇటీవలే తొలి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ కి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది.

ఈ నెల 23వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో మొదలెట్టనున్నట్టు సమాచారం. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా టీమ్ కేరళ .. రాజస్థాన్ వెళ్లవలసి వుంది. కానీ హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాతనే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఈ సినిమాలో నయనతార చేస్తుందా .. లేదా? అనే విషయంలో ఈ షెడ్యూల్లో క్లారిటీ వచ్చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. 
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News