కాలుష్యం తగ్గింపునకు జర్మనీ వినూత్న ఆలోచన... అందరికీ ఉచిత ప్రయాణం
- 20 పట్టణాల్లో ప్రమాద స్థాయికి చేరిన కాలుష్యం
- దాన్ని నిరోధించేందుకు ఉచిత ప్రయాణ ప్రతిపాదన
- డీజిల్ వాహనాలను నిషేధించే ఆలోచన
పట్టణ వాయు నాణ్యత నియంత్రణలో విఫమవుతున్నందుకు జర్మనీపై యూరోపియన్ యూనియన్ చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో, దీనికి నిరోధంగానే జర్మనీ సర్కారు తాజా ప్రతిపాదన చేసింది. ఉచిత రవాణా సౌకర్యం వల్ల అయ్యే వ్యయాలపై ఇప్పటికైతే స్పష్టత లేదు. అవసరమైతే మున్సిపాలిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని పంచుకుంటాయని అక్కడి ప్రభుత్వ ప్రకటన స్పష్టం చేసింది. నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయులు పెరిగిపోయిన పట్టణాల్లో డీజిల్ వాహనాలను నిషేధించే ఆలోచన కూడా చేస్తోంది.