Philippines: మహిళలపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి క్రూర వ్యాఖ్యలు!

  • మహిళలపై రోడ్రిగో నీచ వ్యాఖ్యలు
  • విస్తుపోయిన ప్రపంచం
  • మహిళలు ఉన్నా, లేకున్నా ఒక్కటేనని వ్యాఖ్య
మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డవారిని కాల్చి పారేయమంటూ గతంలో వివాదాస్పద ఆదేశాలు జారీ చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె ఈసారి మహిళలపై ప్రపంచం విస్తుపోయేలా క్రూరమైన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ రెబల్స్ మహిళల మర్మాంగాల్లో కాల్చుతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రపంచం నివ్వెరపోయింది. ఆయన అక్కడితో ఆగకుండా ఈ విషయంలో సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు.

‘‘మీరున్నా, లేకున్నా ఒక్కటే. మిమ్మల్ని మేం చంపబోం. కానీ మీ మర్మాంగాల్లో కాల్చుతాం’’ అని కమ్యూనిస్ట్ రెబల్స్ మహిళలను ఉద్దేశించి అధ్యక్షుడు హెచ్చరించారు. ఇటీవల జరిగిన మాజీ తిరుగుబాటుదారుల సమావేశంలో ఆయనీ హెచ్చరికలు చేశారు. జైళ్లలో ఉన్న రెబల్స్ మహిళలను సిబ్బందితో అత్యాచారాలు చేయించి చంపేస్తున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్యుటెర్టె తాజా వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి.
Philippines
President
Duterte
Women

More Telugu News