raghuveera reddy: రఘువీరారెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్.. అందుబాటులోకి రాని ఏపీసీసీ అధ్యక్షుడు!

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వార్షిక బ‌డ్జెట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి అన్యాయం జ‌రిగిన నేప‌థ్యంలో సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంయుక్త నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ (జేఎఫ్సీ) ని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఆయ‌న ఇప్ప‌టికే లోక్‌సత్తా అధ్య‌క్షుడు జయప్రకాశ్‌ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు ప‌లువురితో మాట్లాడారు.

కాగా, ఈ విష‌యంపై మాట్లాడేందుకు ప‌వ‌న్ నిన్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఫోన్ చేసిన‌ట్లు తెలిసింది. అయితే, పవన్‌ ఫోన్ కి ర‌ఘువీరారెడ్డి స్పందించలేదని స‌మాచారం. నిన్న రఘువీరా పుట్టినరోజు కావడంతో ఆయ‌న త‌న కుటుంబ సభ్యులతో తప్ప ఎవరితోనూ మాట్లాడడం లేద‌ని కాంగ్రెస్‌ పార్టీ నేత‌లు అంటున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ విష‌యంపై మ‌రోరోజు ర‌ఘువీరారెడ్డికి ఫోన్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. 
Go Back to Shorts
raghuveera reddy
Pawan Kalyan
janasena

More Telugu News