బోర్ కొట్టిస్తున్న ఫేస్ బుక్... 'టాటా' చెప్పేస్తున్న యూత్!
- ఫేస్ బుక్ ను వీడుతున్న 25 ఏళ్లలోపు యూత్
- స్నాప్ చాట్ కు పెరుగుతున్న ఆదరణ
- వెల్లడించిన 'ఇమార్కెటర్' రిపోర్టు
12 నుంచి 17 సంవత్సరాల వయసువారిలో దాదాపు 6 శాతం మంది, 12 ఏళ్లలోపు వారిలో 9.3 శాతం మంది ఫేస్ బుక్ కు టాటా చెప్పారని తెలిపింది. తదుపరి రెండు మూడేళ్ల వ్యవధిలో 25 ఏళ్లలోపున్న ఖాతాదారుల్లో 20 లక్షల మందిని ఫేస్ బుక్ దూరం చేసుకోనుందని అంచనా వేసింది. ఇదే సమయంలో స్నాప్ చాట్ కు 19 లక్షల మంది, ఇన్ స్టాగ్రామ్ కు 18 లక్షల మంది కొత్త ఖాతాదారులు రానున్నారని తెలిపింది. 24 గంటల తరువాత సందేశం అదృశ్యమయ్యే స్నాప్ చాట్ యూత్ లో బాగా పాప్యులర్ అయిందని 'ఇమార్కెటర్' అనలిస్ట్ డెబ్రా అహో విలియంసన్ వెల్లడించారు. కాగా, ప్రస్తుతం యూఎస్ లో ఫేస్ బుక్ కు 16.95 కోట్లు, ఇన్ స్టాగ్రామ్ కు 10.47 కోట్లు, స్నాప్ చాట్ కు 8.65 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు.