ఎన్నికల్లో ఇక పోటీ చేయను: బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి సంచలన నిర్ణయం
- ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన
- వయోభారం, అనారోగ్యమే కారణమని వెల్లడి
- పార్టీకి సేవలు కొనసాగుతాయని స్పష్టీకరణ
ఇప్పటివరకు తాను రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేశానని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, తన ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదని ఆమె అన్నారు. మోకాళ్లు, వెన్నునొప్పితో చాలా బాధపడుతున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఝాన్సీ ఎంపీగా ఉన్న ఆమె గతంలో ఖజురహోకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.