Chandrababu: ఇన్నాళ్లూ చంద్రబాబు ఎందుకు మౌనంగా వున్నారు?: విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని కేంద్ర ప్రభుత్వంపై రుద్దుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. గత నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు మౌనంగానే ఉండిపోయారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటులో టీడీపీ ఎంపీలు రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు విమర్శించారు.

ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నది కేవలం వైసీపీ మాత్రమే అని విజయసాయి అన్నారు. పార్టీ ప్రయోజనాల కోసమే వైసీపీ ఎంపీలు పోరాడారని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో, ఓ ఎంపీగా తాను అందరినీ కలుస్తున్నానని చెప్పారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 
Go Back to Shorts
Chandrababu
vijayasai reddy
Special Category Status

More Telugu News