మోదీ వ్యాఖ్యలపై మరోసారి విరుచుకుపడ్డ రేణుకా చౌదరి
- నవ్వడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు
- ఐదు దఫాలుగా రాజ్యసభలో ఉంటున్న నన్ను నెగెటివ్ పాత్రతో పోల్చారు
- మహిళలపై మోదీకి ఎలాంటి గౌరవం ఉందో ఇది తెలియజేస్తోంది
అసలు నవ్వేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. నవ్వుపై జీఎస్టీ కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. ఐదు దఫాలుగా తాను రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నానని... అలాంటి తనను మోదీ ఒక నెగెటివ్ పాత్రతో పోల్చడం అత్యంత దారుణమని మండిపడ్డారు. మహిళల పట్ల మోదీకి ఉన్న దృక్పథాన్ని ఆయన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు.