సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అది అమ్మాయిల ఇష్టమంటున్న రకుల్
  • జోరు మీదున్న 'భరత్ అనే నేను'
  • హాలీవుడ్ చిత్రానికి మనోజ్ సంగీతం  
  • కథలు వింటున్న అనుష్క
*  'అమ్మాయిలు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలన్నది వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది.. ఇది పూర్తిగా వారి అభీష్టమే' అంటోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. "ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నామన్నది కాకుండా, ఎంత పద్ధతిగా, ఒద్దికగా ధరించామన్నదే ముఖ్యం. దీనిపై కామెంట్ చేసే అధికారం ఎవరికీ లేదు" అని చెప్పింది రకుల్.        
*  మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ హైదరాబాదు పరిసరాల్లో జరుగుతోంది. మార్చి మొదటి వారానికల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ వర్గాలు చెప్పాయి. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తారు.
*  హీరో మంచు మనోజ్ సంగీత దర్శకుడిగా కూడా మారాడు. మంచు లక్ష్మి నటించిన  'బాస్మతి బ్లూస్' హాలీవుడ్ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఈ విషయాన్ని తాజాగా తనే వెల్లడించాడు. సంగీత దర్శకుడు అచ్చు రాజమణి, అమెరికన్ రాక్ బ్యాండ్ పెరల్ జామ్ లతో కలసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినట్టు మనోజ్ తెలిపాడు.
*  ఇటీవల రిలీజైన 'భాగమతి' చిత్రం కథానాయిక అనుష్క ఖాతాలో మరో భారీ హిట్ ను వేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో అనుష్క కొన్ని కొత్త చిత్రాలకు సంతకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, వీటిలో వాస్తవం లేదని, ఆమె ఇంకా ఏ చిత్రానికీ ఓకే చెప్పలేదని అనుష్క సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె కథలు వింటున్నట్టు తెలిపాయి.
Rakul
Mahesh Babu
manoj
Anushka Shetty

More Telugu News