murder: చనువుతో 'పెళ్లెప్పుడు?' అని అడిగినందుకు ఆమెను చంపేశాడు!

షార్ట్స్‌లో చూడండి
బంధువులెవరైనా కనిపిస్తే ఎలా ఉన్నావు? అని అడగడం సర్వసాధారణం. పెళ్లీడు కొచ్చిన వారినైతే కాస్త చనువున్నవారు పెళ్లెప్పుడు? అని అడగడం కూడా సహజమే. కానీ ఈ వార్త చదివిన తరువాత పెళ్లి కాని ప్రసాదులను పెళ్లెప్పుడు? అని అడగాలంటే భయమేస్తుంది. వార్త వివరాల్లోకి వెళ్తే... ఇండోనేషియాకి చెందిన ఫాయిజ్‌ నుర్డిన్ (28), కాంపుంగ్‌ పసిర్‌ జొంగ్‌ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతని ఇంటి పక్కనే 32 ఏళ్ల ఐస్యా నివసిస్తుంది.

 పక్కింట్లో ఉండే ఆమెకు అతనంటే అభిమానం. దీంతో ఆమె, అతనిని తరచు 'ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీ వయసు వారందరికీ పెళ్లిళ్లు అయిపోయాయ్‌. నువ్వు పెళ్లి చేసుకోవా?' అంటూ ప్రశ్నించేది. ఎప్పుడలా అడిగినా ఓ చిన్న చిరునవ్వు వదిలి వెళ్లిపోయే ఫాయిజ్, ఇటీవల మాత్రం ఆమె అలా అడిగేసరికి సహనం కోల్పోయాడు. ‌దీంతో, ఆమెపై దాడి చేసి హతమార్చాడు. ఆమె దగ్గరున్న కొంత నగదుతో పాటు, మొబైల్ ఫోన్ ను తీసుకుని జకార్తా పయనమయ్యాడు. దీంతో హత్యకేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, అతనిని పట్టేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. 
Go Back to Shorts
murder
indonesia

More Telugu News