రేణుకా చౌదరిపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్
- రేణుకా చౌదరిని కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు చేశారు
- పక్షపాత ధోరణితో వ్యవహరించవద్దని వెంకయ్యనాయుడిని కోరాం
- ఓ ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని కించపరిచే విధంగా మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొంది. పక్షపాత ధోరణితో వ్యవహరించవద్దని, సభలో సాటి సభ్యులను గౌరవించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కోరామని ఆ ట్వీట్ లో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా, రేణుకా చౌదరిపై మోదీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ సమర్థించారు. ‘మహిళ’ అనే దానిని అడ్డం పెట్టుకుని రేణుక తన ఇష్టానుసారం మాట్లాడితే ఎలా? అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.